పాతకూలర్‌ని కూడా కొత్తగా చేసే పరికరం.. ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..

by Disha Web Desk 20 |
పాతకూలర్‌ని కూడా కొత్తగా చేసే పరికరం.. ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : వేసవికాలం వచ్చేసింది. చల్లని గాలికోసం పరితపించేవారు కొత్త కొత్త కూలర్లని, ఏసీలని పెట్టుకునేందుకు చూస్తారు. మరికొంతమంది పాత కూలర్లని పెట్టుకుంటూ ఉంటారు. అయితే కూలర్ పాతది కావడంతో అది మురికిగా మారిపోతుంది. దీనివల్ల చల్లదనం కూడా రాదు. అలాంటి వాటిని కొత్తగా మార్చే పరికరం ఒకటి మార్కెట్లో అందుబాటులోకి వచ్చేసింది. దీని సహాయంతో మీ కూలర్ శుభ్రం చేయొచ్చు. అంతే కాదు ఈ పరికరాలను మీ స్మార్ట్‌ఫోన్‌కి కూడా కనెక్ట్ చేయవచ్చు. మరి ఆ పరికరాలేంటో, వాటి ధర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూ - జెన్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్..

న్యూ - జెన్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ని మీ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. పేరులో ఉన్నట్టుగానే ఇది రోబోట్ వాక్యూమ్ క్లీనర్. దీని సహాయంతో మీరు ఏదైనా శుభ్రం చేయవచ్చు. చాలా మంది మొదటి ఎంపిక కూడా ఇదే. ఇవి వివిధ కంపెనీల నుంచి లభిస్తాయి.

కూలర్‌ను ఎలా శుభ్రం చేస్తారు ?

కూలర్‌ను శుభ్రం చేయడానికి మీరు చిన్న సైజు వాక్యూమ్ క్లీనర్‌ను కొనుగోలు చేయాలి. ఇది మొత్తం మురికిని బయటకు తీస్తుంది. దీని ద్వారా కూలర్ లోపల కూడా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. కూలర్‌ని ఉపయోగించిన తర్వాత చాలా సార్లు, దానిలో ధూళి ఉండిపోతుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ పూర్తిగా శుభ్రం చేయడంలో సహాయపడుతుంది.

యాప్‌కి ఎలా కనెక్ట్ చేయాలి ?

యాప్‌కి కనెక్ట్ చేయడానికి మీరు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. మీరు సింపుల్ వాక్యూమ్ క్లీనర్ బ్రాండ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఐలైఫ్‌హోమ్ ఉదాహరణగా తీసుకుందాం. మీరు ఈ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లోకి వెళ్లగానే చాలా ఫీచర్లు కనిపిస్తాయి. దీనిలో మీరు కనెక్ట్ చేసే ఎంపికను చూస్తారు. అయితే మీరు మీ ఫోన్ బ్లూటూత్ ఆన్‌లో ఉండేలా చూసుకోవాలి. వాక్యూమ్ క్లీనర్‌ని మొబైల్‌కి కనెక్ట్ చేసిన తర్వాత, మీరు దానిని మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఉపయోగించవచ్చు. మీరు వాక్యూమ్ క్లీనర్‌ను ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేయవచ్చు. 1500 నుంచి మొదలవుతుంది. అయితే నాణ్యమైన క్లీనర్ కొనాలంటే దాదాపు రూ.5,000 వెచ్చించాల్సి ఉంటుంది.

Next Story

Most Viewed