తలకింద దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

by Disha Web Desk 7 |
తలకింద దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
X

దిశ, ఫీచర్స్: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం నిద్ర పోవడానికి కూడా చాలా మందికి టైం దొరకడం లేదు. అయితే మనసుకు ప్రశాంతత ఎంతో అవసరం. మాక్సిమమ్ 6 నుంచి 7 గంటల నిద్ర ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యం. అంతే కాదు ప్రశాంతమైన నిద్ర కారణంగా ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయి. అయితే.. చాలా మందికి తల కింద దిండు లేకపోతే నిద్ర పట్టదు. ఒక్కొక్కరు అయితే ఏకంగా రెండు, మూడు దిండ్లు కలిపి మరీ తల కింద పెట్టుకుంటారు. కానీ, తల కింద దిండు లేకుండా పడుకుంటే బోలెడు లాభాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిజానికి తల కింద దిండు పెట్టుకుని పడుకుంటే కొన్ని చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. వాటిలో ముఖ్యమైనవి మొటిమలు. ఎందుకంటే దిండుపై తల పెడ్డుకున్నప్పుడు దానిపై చుండ్రు పడటమే కాకుండా.. బ్యాక్టీరియా, ధూళి వంటివి కూడా పేరకుపోతాయి. ఈ కారణంగా మొఖంపై మొటిమలు వస్తాయట. అంతేకాదు ముఖంపై ముడతలు కూడా వస్తాయని చెప్తున్నారు నిపుణులు. ఇలా జరగకుండా మీ ముఖం అందంగా, యవ్వనంగా ఉండాలంటే దిండు లేకుండానే పడుకోవమే ఉత్తమమైన మార్గం అని చెబుతున్నారు నిపుణులు.

అంతే కాకుండా తల కింద దిండు లేకుండా పడుకోవడం వల్ల తలకు రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. దీంతో జుట్టు కూడా పెరుగుతుంది. అంతే కాకండా సరైన రక్త ప్రసరణ జరగడం వల్ల ఒత్తిడి తగ్గి.. ప్రశాంతంగా నిద్ర పడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా అధ్యయనాల్లో కూడా ఇది ఫ్రూవ్ అయిందని తెలుస్తుంది. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే దిండు లేకుండా పడుకోలేము అనుకునే వాళ్లు కాస్త చిన్న దిండ్లు ఉపయోగించడం మంచిదని సలహా ఇస్తున్నారు నిపుణులు. అంతే కాకుండా ఎత్తైన దిండ్లు వాడటం వల్ల మెడ, వెన్నె నొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Next Story