- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీసీఐ 'టీమ్ మాస్క్ ఫోర్స్'కు అనూహ్య స్పందన
కరోనా కష్టకాలంలో అందరూ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయారు. ఈ క్లిష్ట సమయంలో క్రికెటర్లు, సెలబ్రిటీలు ఇంటి నుంచే ప్రజలను, అభిమానులను అప్రమత్తం చేసేలా వీడియోలు, సందేశాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ శనివారం ప్రారంభించిన ‘టీమ్ మాస్క్ ఫోర్స్’కు అనూహ్య స్పందన లభించింది. సొంతంగా మాస్కులు తయారు చేసుకొని ధరించాలని కోరుతూ బీసీసీఐ ఈ ఛాలెంజ్‌ను మొదలు పెట్టింది. దీనిలో మాజీ క్రికెటర్ల నుంచి ప్రస్తుత ఆటగాళ్ల వరకు అందరూ భాగస్వామ్యులు కావాలని కోరింది. ఇందుకోసం ఒక వీడియోను సైతం రూపొందించిది. విరాట్ కోహ్లీతో ప్రారంభమయ్యే ఈ వీడియోలో స్మృతి మంధాన, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, హర్మన్ ప్రీత్ కౌర్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, మిథాలీరాజ్ చివరిగా సచిన్ టెండూల్కర్‌లు కనిపిస్తారు.
మోడీ టాస్క్‌ఫోర్స్ స్ఫూర్తితో బీసీసీఐ దీన్ని ప్రారంభించిందని.. మనం కూడా 130 కోట్ల మంది ప్రజలతో మరో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేద్దామని క్రికెటర్లు పిలుపునిచ్చారు. బీసీసీఐ ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ను ప్రధాని మోడీ కూడా మెచ్చుకున్నారు. #TeamMaskForce హ్యాష్ ట్యాగ్‌తో మోడీ కూడా బీసీసీఐ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. కాగా, బీసీసీఐ పిలుపుతో వేలాది మంది నెటిజన్లు మాస్కులు ధరించిన ఫొటోలు పెడుతున్నారు.
tags : BCCI, Team Mask Force, Cricketers, PM Modi, Lockdown