- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
15 ఏళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడనున్న టీమ్ ఇండియా
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మహిళా జట్టు 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడనున్నది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నది. ఆ పర్యటనలో ఒక టెస్టు మ్యాచ్‌తో పాటు పరిమిత ఓవర్లు క్రికెట్ మ్యాచ్‌లు కూడా ఆడనున్నట్లు క్రిక్ఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది. టీమ్ ఇండియా చివరిసారిగా 2006లో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు అడిలైడ్‌లో టెస్టు మ్యాచ్ ఆడింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 9 టెస్టులు జరిగాయి.
తొలి సారిగా 1977లో పెర్త్‌లో టెస్టు జరిగింది. ఇండియాలో 1984లో నాలుగు టెస్టులు ఆడారు. ఆ తర్వాత 1990-91 సీజన్‌లో నాలుగు టెస్టులు, 2006లో ఆస్ట్రేలియాలో ఒక టెస్టు జరిగింది. ఆ తర్వాత మళ్లీ 2021లోనే టెస్టు మ్యాచ్ జరగనుండటం విశేషం. మరోవైపు టీమ్ ఇండియా మహిళా జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఏకైక టెస్టు ఆడనున్నది. 2014 తర్వాత భారత జట్టు ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ ఇదే. కాగా, ఆస్ట్రేలియా పర్యటనను బీసీసీఐ, సీఏ ఖరారు చేయాల్సి ఉన్నది.