- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదుకున్న ఆల్‌రౌండర్లు.. భారత్ భారీ స్కోరు
దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, జడేజా అదరగొట్టారు. వరుసగా వికెట్లు సమర్పించుకోవడంతో స్వల్ప స్కోరుతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని భావించిన అందరి అంచనాలను తారుమారు చేసి, ఆసీస్ బౌలర్లపై హర్దిక్, జడేజా విరుచుకుపడ్డారు. కెప్టెన్ కోహ్లి అవుట్ కావడంతో కష్టాల్లో మునిగిపోయిన జట్టును గట్టెక్కించారు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరిగెత్తించారు. 47వ ఓవర్‌లో జడేజా వరుసగా మూడు ఫోర్లు, సిక్స్‌లతో భారీ షాట్లు ఆడుతూ.. ఆసీస్ బౌలర్ అబాట్‌కు చుక్కలు చూపించాడు. కేవలం 43 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు జడేజా. ఇక 76 బంతుల్లో ఏడు బౌండరీలు, ఒక సిక్స్‌తో పాండ్యా 92 పరుగులు సాధించాడు. మొత్తం 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 302 భారీ స్కోరు చేసింది ఇండియా.
అయితే.. సిరీస్‌లో మొట్టమొదటిసారిగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన వరుసగా వికెట్లు సమర్పించుకున్నది. ఓపికతో నిలకడగా ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 152 పరగుల వద్ద హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యారీకి క్యాచ్‌కి ఇచ్చి కోహ్లి(63) పెవిలియన్ చేరారు. అంతకముందు శిఖర్ దావన్(16), శుభ్‌మన్ గిల్(33), శ్రేయస్ అయ్యర్(19), కేఎల్ రాహుల్(05)లు స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరి, జట్టును కష్టాల్లోకి నెట్టారు. దీంతో భారం మొత్తం ఆల్ రౌండర్లు హర్దక్ పాండ్యా, రవీంద్ర జడేజా పైనే పడింది. ఆ తర్వాత ఇరువురు ఆల్‌రౌండర్లు ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడి, జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.
ఆసీస్ బౌలర్లలో హేజుల్ వుడ్ 10-01-66-1, గ్లెన్ మాక్స్‌వెల్ 5-00-27-00, సీన్ అబాట్ 10-00-84-01, కెమెరాన్ గ్రీన్ 04-00-27-00, అగర్ 10-00-44-02, ఆడమ్ జాంపా 10-00-45-01, హెన్రిక్స్ 01-0-07-00లు రాణించారు.