రెండో రోజూ భారత్‌దే

by Shiva |   ( Updated:2021-03-05 06:29:08.0  )
రెండో రోజూ భారత్‌దే
X

దిశ వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు భారత్ దుమ్మురేపింది. రిషబ్ పంత్ సెంచరీతో వీరవీహరం చేయడం, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో మెరవడంతో.. రెండో రోజు ఆట భారత్ నెగ్గింది. ఒక దశలో 146 పరుగులతో ఆరు వికెట్లు కోల్పోవడంతో భారత్ కష్టాల్లో పడింది. అప్పుడు బ్యాటింగ్‌కు దిగిన రిషబ్ పంత్ తన హిట్టింగ్‌తో 118 బంతుల్లో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. జేమ్ అండర్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్‌కి క్యాచ్ ఇచ్చాడు.

ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా స్పీడ్‌గా ఆడుతూ హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 294/7 పరుగులతో 89 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వాషింగ్టన్ సుందర్ 60(117) పరుగులు, అక్షర్ పటేల్ 11(34) పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇక ఇవాళ రోహిత్ శర్మ 49, చటేశ్వర్ పుజారా 17, రహానే 27, అశ్విన్ 13 పరుగులు చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. నిన్న ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకోగా.. తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే ఆలౌట్ అయింది.

Advertisement

Next Story

Most Viewed