- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సానియా భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలి.. క్రికెట్ అభిమానుల ఆగ్రహం..
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాపై టీమ్ ఇండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సానియా కూడా హాజరవుతున్నది. తన భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్ జట్టుకు ఆడుతుండటంతో ప్రతీ మ్యాచ్‌కు వచ్చి గ్యాలరీల్లో కూర్చొని ఉత్సాహపరుస్తున్నది. అయితే ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కనపడని సానియా.. పాకిస్తాన్ జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌లకు హాజరయ్యింది. ఇదే భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యింది. ఇండియా-పాక్ మ్యాచ్‌కు రాలేదంటే ఒప్పుకుంటాం.. కానీ యూఏఈలోనే ఉంటూ ఇండియా ఆడిన ఇతర మ్యాచ్‌లకు ఎందుకు వచ్చి క్రికెటర్లకు మద్దతుగా నిలవలేదని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
భారత తరఫున టెన్నిస్ ఆడుతూ పాకిస్థాన్ జట్టుకు స్టేడియంలో మద్దతు తెలపడంపై భారత క్రీడాభిమానులు సానియాపై మండిపడుతున్నారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఆడిన మ్యాచ్‌లకు హాజరుకాకుండా పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లకు హాజరై మద్దతు తెలపడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కొంత మంది అభిమానులైతే.. సానియాకు ఉన్న భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏ జట్టుకు మద్దతు తెలపాలో ప్రతీ ఒక్కరి వ్యక్తిగతమని.. దీనికి ఇలా వివాదం చేయడం మంచిది కాదని కొంత మంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
- Tags
- cricket