- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదే తీరు..చూపని జోరు !
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత జట్టు తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యింది. స్వల్ప వ్యవధిలో చివరి ఆరు వికెట్లు కోల్పోయి..ఎట్టకేలకు 242 పరుగులు చేయగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టును కివీస్ బౌలర్లు జేమిసన్ (5), బౌల్ట్ (2), సౌథీ (2) వికెట్లతో కుప్పకూల్చారు. ఓపెనర్ పృథ్విషా (54), పుజారా (54) , విహారి (55) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఇక కెప్టెన్ కోహ్లీ తన వైఫల్యాన్ని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. గత మ్యాచ్‌లో రాణించిన రహానే కూడా కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరడంతో భారత జట్టు కేవలం 242 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ పృథ్వి షా హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడమొక్కటే ఈ ఇన్నింగ్స్‌లో సానుకూలాంశం.
ఆ తరువాత ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ భారత బౌలర్లను ఉతికారేశారు. భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ నిలకడగా ఆడారు. ఈ క్రమంలో ఓపెనర్ టామ్ లేథమ్ (27), బ్లండెల్ (29) పరుగులు చేశారు. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 23 ఓవర్లలో 63 పరుగులు చేసి భారత్‌పై పైచేయి సాధించింది.