సమాజం తలదించుకునేలా.. సర్పంచ్, ఉపాధ్యాయుల తీరు

by Sumithra |   ( Updated:2020-03-16 08:22:28.0  )
సమాజం తలదించుకునేలా.. సర్పంచ్, ఉపాధ్యాయుల తీరు
X

దిశ, మెదక్: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడం వల్ల సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించారు. దీంతో విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడించాల్సిన సర్పంచ్ సభ్య సమాజం తలదించుకునేలా చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని గడ్డతండాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం గడ్డతండా సర్పంచ్ విఠల్ నాయక్ ఇంట్లో కొంతమంది పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు అందిన సమాచారం మేరకు నారాయణఖేడ్ ఎస్సై సందీప్ సిబ్బందితో వెళ్లి దాడి నిర్వహించారు. ఆ సమయంలో అక్కడి నుంచి ఒకరు పారిపోగా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా, సర్పంచ్ విఠల్ నాయక్‌ ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.22,270 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
Tags: Teachers, Sarpanch, playing poker, police raid, arrest, case, carona virus, medak

Advertisement

Next Story