టీచర్‌కు కరోనా.. ఈ పాపం ప్రభుత్వానిదా.. అధికారులదా..?

by vinod kumar |   ( Updated:2021-09-02 23:18:46.0  )
టీచర్‌కు కరోనా.. ఈ పాపం ప్రభుత్వానిదా.. అధికారులదా..?
X

దిశ, మణుగూరు :పాఠశాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, రెండు రోజుల వ్యవధిలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగూడెం పంచాయతీలోని గోవిందాపురం గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలుకు కరోనా సోకింది. గత రెండు రోజుల నుంచి ఉపాధ్యాయురాలుకు వొళ్లు నొప్పులు, జ్వరం వస్తుండటంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీనితో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, టీచర్స్ అందరూ భయానికి లోనయ్యారు.

పాఠశాల ప్రారంభమై రెండు రోజులు కాకముందే ఉపాధ్యాయురాలికి కరోనా వ్యాధి సోకడంతో పినపాక మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.వెంటనే రంగంలోకి దిగిన పినపాక నియోజకవర్గ విద్యాధికారి వీరస్వామి ప్రాథమిక పాఠశాలకు వారం రోజులు సెలవులు ప్రకటించారు.ఈ విషయంపై విద్యాధికారి ఎంఈఓని దిశ విలేకరి వివరణ కోరగా విద్యార్థులందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తామని తెలియజేశారు. పాఠశాల మొత్తం శానిటేషన్ నిర్వహిస్తామన్నారు. తల్లిదండ్రులు ఎవరూ భయాందోళనకు గురికావొద్దని, విద్యార్థులు అందరూ క్షేమంగానే ఉన్నట్టు విద్యాధికారి ఎంఈవో ఒక ప్రకటనలో తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed