- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యాపిల్లలున్న ఆ టీచర్.. యువతితో ప్రేమలో పడ్డాడు
దిశ ఏపీ బ్యూరో: స్పోకెన్ ఇంగ్లీషు కోచింగ్‌కు వచ్చిన యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్న టీచర్ చిలకా శ్రీనివాసరావును గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ రవీందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి… పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీ కృష్ణదేవరాయనగర్‌కు చెందిన శ్రీనివాసరావు బ్రాడీపేటలో స్పోకెన్ ఇంగ్లీషు కోర్సు ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నాడు. ఆయనకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. డీఈడీ చదువుతున్న ఓ యువతి స్పోకెన్ ఇంగ్లీషు కోచింగ్‌కు వెళ్ళింది. అప్పటి నుంచి ఆమెను ప్రేమిస్తున్నానంటూ శ్రీనివాసరావు వెంటపడ్డాడు.
కోచింగ్ సెంటర్ ఉండడంతో యువతి సరేనంది దీంతో తల్లిదండ్రులకు అబద్దపు మాటలు చెప్పి పెళ్ళి చేసుకుంటానని ఒప్పించి నిశ్చితార్ధం చేసుకున్నాడు. అలాగే వారి నుంచి రెండు లక్షల రూపాయలు కట్నం కూడా తీసుకున్నాడు. అనంతరం శ్రీనివాసరావుకు పెళ్ళయి, పిల్లలున్న విషయం బాధిత కుటుంబానికి తెలిసి పెళ్ళికి నిరాకరించారు. అప్పటి నుంచి శ్రీనివాసరావు అంతవరకు ప్రేమిచానన్న యువతిని శారీరకంగా, మానసికంగా వేధిస్తుండటంతో ఆమె ఫిర్యాదు మేరకు గతేడాది అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో నిందితుడు శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జైలుకు వెళ్ళిన శ్రీనివాసరావు బెయిల్‌పై విడుదలై మళ్ళీ పెళ్ళి చేసుకోవాలంటూ వేధిస్తుండటంతో బాధితురాలు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.