'జగన్ కు ఏ కరోనా సోకిందో.. ఏడాదిన్నరగా క్వారంటైన్‌లో ఉన్నాడు'

by srinivas |   ( Updated:2021-06-29 04:39:40.0  )
cm jagan news
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనాతో రాష్ట్రంలో వేలాది మంది మరణాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కారణమని టీడీపీ మహిళా రాష్ట్రమహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. కరోనా వల్ల ప్రపంచమంతా భయపడితే సీఎం జగన్ తేలిగ్గా తీసుకున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన సాధన దీక్షలో పాల్గొన్న ఆమె కరోనా వచ్చి ప్రజలు 15 రోజులు క్వారంటైన్‌లో ఉంటే సీఎం జగన్ మాత్రం ఏడాదిన్నర క్వారంటైన్‌లో ఉన్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు. జగన్‌కు ఏ కరోనా సోకిందో లేదో తెలియదుగానీ ఏడాదిన్నరకు పైగా తాడేపల్లిలోని ఇంటిని వదిలి రాలేదని విమర్శించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు భరోసా కల్పించడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు.

కరోనా కాలంలో కూడా జే ట్యాక్స్ కోసం అన్నిరేట్లు పెంచారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు సాధన దీక్ష చేస్తున్నారని తెలియడంతో జగన్‌లో భయం పట్టుకుందన్నారు. అందుకే సాధన దీక్షను డైవర్ట్ చేసుకునేందుకు దిశ యాప్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. దిశ యాప్‌ను ఎప్పుడో ఆవిష్కరిస్తే ఇప్పుడు ఆవిష్కరణ ఏంటో..? అని ప్రశ్నించారు. చట్టబద్దత లేని దిశచట్టానికి యాప్ ఎందుకని విమర్శించారు. జగన్ హయాంలో 9ఏళ్ళ చిన్నారిపై కూడా అఘాయిత్యాలు జరిగాయని వాటికి జగన్ ఏం సమాధానం చెప్తారని వంగలపూడి అనిత నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed