మాగంటి బాబును పరామర్శించిన చంద్రబాబు

by srinivas |
maganti babu 1
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత, మాజీమంత్రి మాగంటి బాబు కుటుంబాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల మాగంటి బాబు కుమారుడు, పశ్చిమగోదావరి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రాంజీ మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఏలూరులో మాగంటి నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడ నిర్వహించిన సంస్మరణ సభలో పాల్గొన్నారు. రాంజీకి నివాళులర్పించారు. రాంజీ మరణం బాధాకరమన్నారు. జిల్లాలో మాగంటి కుటుంబం అనేక సేవలందించిందని చంద్రబాబు కొనియాడారు. ఆ కుటుంబానికి అందరూ అండగా నిలబడాలన్నారు. మాగంటి బాబు కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

Advertisement

Next Story