రేపు ఏలూరుకి చంద్రబాబు

by srinivas |
chandrababu
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరు వెళ్లనున్నారు. మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) కుటుంబాన్ని పరామర్శించనున్నారు. మాగంటి కుమారుడు రాంజీకి చంద్రబాబు నివాళులు అర్పించనున్నారు. ఇటీవలే రాంజీ మృతి చెందిన విషయం తెలిసిందే. పరామర్శ అనంతరం చంద్రబాబు నాయుడు నేరుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఇకపోతే అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఉదయం సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story