- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైలుకి వెళ్లేందుకు సిద్ధం -గల్లా
దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఐదేళ్లు పూర్తైన సందర్భంగా ఉద్ధండరాయునిపాలెంలో రైతులు, మహిళలు పోరాటం నిర్వహిస్తున్నారు. వారి పోరాటానికి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
వైసీపీ ప్రభుత్వానికి ఆలోచన, విజన్ లేదని విమర్శించారు. అమరావతిని ప్రపంచశ్రేణి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని భావించామని.. కొత్త ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులంటున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మంచిపేరు దక్కకూడదనే అమరావతిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
అమరావతి ఉద్యమంలో రైతులు, మహిళల పోరాటం అసామాన్యమైనదని, పోరాటాన్ని ఇంకాఉద్ధృతం చేయాలని సూచించారు. అమరావతి కోసం ఉద్యమం చేసినందుకు ఇప్పటికే జైలుకు వెళ్లానని, భవిష్యత్తులోనూ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అమరావతిపై స్పందించాలని గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు.