- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలాంటి దరిద్రపు ఊరు జిల్లాలో లేదు!
తెలుగుదేశం పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకొని తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పార్టీని నేతలు మరింత ఇరకాటంలో పెట్టేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమిపాలై తీవ్ర ఒడిదొడికుల్లో ఉన్న పార్టీని గట్టేక్కించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అధినేతకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొత్త తలనొప్పులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతారన్న బెంగతో అధినేత సతమతం అవుతుంటే, ఓ టీడీపీ ఎమ్మెల్సీ నోటి దురుసు ఏకంగా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. అంతేగాక ఆ ఎమ్మెల్సీ వ్యక్తిగతంగా ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకున్నాడు.
అసలు విషయం ఏంటంటే.. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేపడుతున్నారు. మంగళవారం నుంచి గురువారం వరకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలకు తొలిరోజు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరై కొద్దిసేపు గ్రామస్తులతో మాట్లాడుతూ నోటి దురుసు ప్రవర్తించాడు. ఇలాంటి దరిద్రపు ఊరు జిల్లాలో ఎక్కడా లేదంటూ కామెంట్ చేశాడు. దీంతో ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురై సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇన్నిరోజులు మన ఊరి పేరు చెప్పుకుంటూ ఇప్పుడు మన ఊరిని దరిద్రపు ఊరు అనడం ఏంటని అగ్గిమీద గుగ్గిలమై ఓ నిర్ణయానికి వచ్చారు.
ఇప్పటి నుంచి ఎవరైన టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో నేరుగా మాట్లాడితే రూ.10 వేలు, ఫోన్‌లో మాట్లాడితే రూ.3 వేల జరిమానా విధించాలన్న డిసిషన్‌కు వచ్చారు. అంతేగాక అటు మత్స్యకార మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారు కూడా సీరియస్‌గా ఉన్నారు. సొంత గ్రామాన్ని విమర్శించాల్సిన అవసరం ఎందుకువచ్చిందని ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తుండగా ఆయనతో మాట్లాడితే ఫైన్ కట్టాలని గ్రామస్తులు పెట్టుకున్న నిబంధన టాపిక్‌గా మారింది.