- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ ఎమ్మెల్యే వినూత్న నిరసన
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణాయపాలెం రైతులకు బేడీలు వేసిన ఘటనపై గురువారం విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వినూత్నంగా నిరసన తెలిపారు. చేతులకు సంకెళ్లు వేసుకున్నారు. రైతుల చేతులకు బేడీలు వేసి జైలుకు తీసుకువెళ్లడం అత్యంత దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని కోసం కేవలం ఒక సామాజిక వర్గం ఆందోళన చేస్తోందని ప్రచారం చేయడం తగదన్నారు. దళితులు లేరని ప్రభుత్వం చెబుతోంది. అరెస్టు చేసిన రైతుల్లో దళితులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదని విమర్శించారు. తహసిల్దారు కార్యాలయం వద్ద విపక్ష నేతలతో కలిసి ధర్నా చేశారు.
అరెస్టు చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసిల్దారుకు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో వర్ల రామయ్య, పోతిన మహేష్, జేఏసీ కో-కన్వీనర్ శివారెడ్డి పాల్గొన్నారు.