- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్విట్టర్‌లో లోకేశ్.. కంపెనీ కోసం ప్రశ్న
దిశ, వెబ్ డెస్క్: జగన్ పై టీడీపీ నేత లోకేశ్ మరోసారి ఫైరయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఏపీలో ఉద్యోగల కల్పన విషయం, కంపెనీల ఏర్పాటు విషయమై జగన్ ను ప్రశ్నించారు.
‘చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణకు కేర్ అఫ్ అడ్రస్ అయితే, జగన్ రెడ్డి విద్వేష వికేంద్రీకరణకు బ్రాండ్ అంబాసిడర్. టీడీపీ హయాంలో పారిశ్రామికరంగాన్ని పరుగులు పెట్టించడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు అన్ని జిల్లాలకు ఎలా అందాయో వైసీపీ ప్రభుత్వమే పూసగుచ్చినట్టు బయటపెట్టింది.
ఐదేళ్ల టీడీపీ పాలనలో 39,450 పరిశ్రమలు వచ్చాయని, వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు, అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు రాబోతున్నాయి అని వైసీపీ ప్రభుత్వం బల్ల గుద్ది మరీ చెబుతోంది. 14 నెలల జగన్ పాలనలో రాష్ట్రానికి గుడ్ బై చెప్పిన కంపెనీలే తప్ప వచ్చిన ఒక్క కంపెనీ అయినా ఉందా?’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.