సీఎం జగన్ లిక్కర్ డాన్.. అతనేమో ఓ తోలుబొమ్మ.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by srinivas |
సీఎం జగన్ లిక్కర్ డాన్.. అతనేమో ఓ తోలుబొమ్మ.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మార్చేశారంటూ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..విజయవాడలో దుకాణాన్ని తెరిచి టన్నుల కొద్దీ హెరాయిన్‌ను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతం సవాంగ్‌పైనా విమర్శలు చేశారు. డీజీపీ తోలుబొమ్మటాంటి వ్యక్తి అంటూ ఘాటు విమర్శలు చేశారు. హెరాయిన్ తరలింపునకు తోలుబొమ్మ లాంటి డీజీపీని అడ్డుపెట్టుకున్నారంటూ విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో ఏం జరగలేదంటూ డీజీపీ స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారంలో సీఎం జగన్ కుట్రంతా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతానని చెప్పుకొచ్చారు. ఏ రకంగా వైన్‌షాపుల్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సక్షన్స్ చేసి నల్ల డబ్బు సంపాదిస్తున్నావో..ఏ రకంగా తాలిబన్లకు చెల్లింపులు చేస్తున్నావో, ఏ రకంగా పోర్టులన్నింటినీ హస్తగతం చేసుకుని.. మాదక ద్రవ్యాల ద్వారా వేల కోట్లు ఎలా సంపాదిస్తున్నావో అన్నింటిని సాక్ష్యాలతో సహా ప్రజలకు తెలియజేస్తానని పట్టాభి హెచ్చరించారు.

దేశంలోనే అతిపెద్ద లిక్కర్ డాన్ సీఎం జగన్..

దేశంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అతిపెద్ద లిక్కర్ డాన్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే వైన్‌షాపుల్లో ఫోన్‌ పే, గూగుల్ పే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. మద్యం దుకాణాల్లో ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ ట్రాన్సక్షన్స్ పెట్టి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లిక్కర్ మాల్స్‌ని ప్రైవేట్ చేతికి అప్పగిస్తూ కోట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. డిజిటల్ ట్రాన్సెక్షన్స్ అమలు చేస్తే వైసీపీ బండారం బయటపడుతుందని చెప్పుకొచ్చారు. మద్యంపైనా రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని..ఇదేనా మద్యపాన నిషేధం అంటేనని పట్టాభి ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed