Nara lokesh : నరసరావుపేటలో నారా లోకేశ్ పర్యటన.. కండిషన్స్ అప్లై!

by srinivas |   ( Updated:2021-09-09 00:41:25.0  )
Nara lokesh : నరసరావుపేటలో నారా లోకేశ్ పర్యటన.. కండిషన్స్ అప్లై!
X

దిశ, ఏపీబ్యూరో : గుంటూరు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో 11 గంటలకు నరసరావుపేట చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు నరసరావుపేటలో ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని లోకేశ్ పరామర్శిస్తారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

శవరాజకీయాలు మానుకో లోకేశ్!

నరసరావుపేటలో నారా లోకేశ్ పర్యటనపై వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ పర్యటన దేనికోసం అని నిలదీశారు. శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. మీ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే పంచాయితీలు చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. మీ రాజకీయం కోసం బాధితులను రోడ్ల మీదకు తెస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేటలో అనూష ఘటనలో తమ ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించిందని చెప్పుకొచ్చారు. బాధిత కుటుంబీకులకు ప్రభుత్వం రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చిందన్నారు. సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని కానీ, ఒక్కరికైనా న్యాయం చేశారా..? అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.

-వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హితవు

లోకేశ్ పర్యటనకు అనుమతి లేదు..

నరసరావుపేటలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్‌ గున్నీ స్పష్టం చేశారు. లోకేశ్ పర్యటన రాజకీయంగా ఉందని.. అనుమతి లేని పర్యటనలకు రాజకీయ నాయకులు రావద్దని స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు నరసరావుపేటలో జరిగిన ఘటనపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు వచ్చినప్పుడు పోలీసులు తీసుకున్న చర్యలకు అభినందనలు తెలియజేశారని ఎస్పీ విశాల్ గున్నీ గుర్తు చేశారు.

-రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ

Advertisement

Next Story

Most Viewed