- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ నియోజకవర్గాలపై కన్నేసిన చినబాబు.. ఈసారి గెలుపు తథ్యం అంటున్న తెలుగు తమ్ముళ్లు
దిశ, ఏపీ బ్యూరో: నందమూరి తారకరామారావు మనవడు ఆ యువనేత. స్వయానా మాజీ ముఖ్యమంత్రి కొడుకు కూడా. అంతేకాదు హీరో నందమూరి బాలకృష్ణకు అల్లుడు కూడా. ఇది ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే తండ్రి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం తాత స్థాపించిన పార్టీలో తండ్రి నాయకత్వంలో పనిచేస్తున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదూ. ఇంకెవరు నారా లోకేశ్. నారా లోకేశ్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి పోటీ చేసి ఓడిపోవడంతో లోకేశ్‌తోపాటు తండ్రి చంద్రబాబు సైతం నిరుత్సాహానికి గురయ్యారు. ఆ ఓటమి పార్టీతోపాటు వ్యక్తిగతంగానూ చాలా మైనస్ అయ్యిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 2024 ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రాకూడదని చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
లోకేశ్ నియోజకవర్గం మార్పు..
2019 ఎన్నికల్లో నారా లోకేశ్ తొలిసారిగా పోటీ చేశారు. అప్పటికే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. తండ్రి కేబినెట్‌లో లోకేశ్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. అంతేకాదు పార్టీలో కీలకంగా పనిచేశారు. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా..మంత్రిగా పని చేసిన లోకేశ్ ఎన్నికల బరిలో ఘోరంగా ఓటమిపాలయ్యారు. నారా లోకేశ్ ఓటమి టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబాన్ని తీవ్ర నిరాసకు గురి చేసింది. దీంతో నారా లోకేశ్ ఇక వరుసగా రెండోసారి కూడా ఓడితే.. పార్టీని నడిపించే బాధ్యతల నుంచి స్వచ్చందంగా తప్పుకోవాల్సి వస్తుంది. పార్టీలో ఎవరూ ఆయన మాట వినే అవకాశం ఉండదని టీడీపీకి చెందిన పలువురు నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అందుకే అలాంటి పరిస్థితి రాకూడదని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. ఎక్కడ నుంచి పోటీ చేస్తే గెలుపొందుతామో అన్న నియోజకవర్గంపై లోకేశ్ జల్లెడపడుతున్నారట. ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం కలిగించే నియోజకవర్గం కోసం వేట మెుదలుపెట్టారట. ఈ బాధ్యతలను పార్టీలోని కీలక నేతలకు అప్పగించారని తెలుస్తోంది.
భీమిలి లేక పెనమలూరు నుంచి పోటీ..?
2024 ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గంపై లోకేశ్ గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. అత్యంత సన్నిహితులతోపాటు సోషల్ మీడియా సెల్, ఎన్నారై విభాగం, ట్రస్ట్ భవన్, మీడియా వింగ్‌ను లోకేశ్ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది త్వరలోనే తేల్చాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మరో రెండున్నరేళ్ల సమయం మాత్రమే ఉండటంతో ఏది అయితే బాగుంటుందో కనిపెట్టే బాధ్యతను వారికి అప్పగించారు. దీంతో రాష్ట్రమంతా పర్యటించిన ఆ బృందం రెండు నియోజకవర్గాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. భీమిలి లేదా పెనమలూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేద్దామని నారా లోకేశ్ భావించారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సబ్బం హరిని బరిలోకి దించారు. 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం మంత్రిగా కూడా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
మంత్రి అవంతిని ఢీ కొట్టేనా?
2019 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి గెలుపొందిన అవంతి శ్రీనివాస్ నియోజకవర్గంపై మంచి పట్టుసాధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భీమిలిని తన అడ్డాగా మార్చుకున్నారు. ఇలాంటి సమయంలో ఆయనను ఢీ కొట్టడం సాధ్యమా అన్నదానిపై చర్చ జరుగుతుంది. అయితే స్థానిక టీడీపీ నేతలు..అనుచరులు మాత్రం భీమిలిలో లోకేశ్ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగినప్పటికీ టీడీపీకి భీమిలి ఓటర్లు అండగానే నిలిచారని స్థానిక నేతలు చెప్పుకొస్తున్నారట. వైసీపీకి, టీడీపీ కన్నా ఓట్ల శాతం కూడా తక్కువేనని, లోకేశ్ బరిలోకి దిగితే వార్ వన్‌సైడ్ అంటూ ప్రచారం జరుగుతుందట. దీంతో లోకేశ్ భీమిలి నుంచి బరిలోకి దిగే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా మారనున్న నేపథ్యంలో భీమిలి నుంచి పోటీ చేస్తే మరింత మంచిదని లోకేశ్ భావిస్తున్నారట.
ప్రస్తుతానికి పార్టీ బలోపేతంపైనే దృష్టి..
ఇకపోతే ఇటీవల జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఫలితాలు మింగుడుపడటం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు నారా లోకేశ్ పర్యటనలు చేస్తున్నారు. 2022 ఏప్రిల్ తర్వాత భీమిలి నియోజకవర్గంపై పట్టుసాధించేందుకు లోకేశ్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకు కంచుకోటగా నిలిచిన ఉత్తరాంధ్రకు పూర్వవైభవాన్ని తీసుకువస్తానని లోకేశ్ ధీమాగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.