మూల్యం చెల్లించాల్సి ఉంటది : మాజీ మంత్రి

by srinivas |
మూల్యం చెల్లించాల్సి ఉంటది : మాజీ మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: ‘ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రభుత్వానికి న్యాయస్థానలపై గౌరవం లేదు. కోర్టుల తీర్పులను ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. “అమరావతి రాజధాని ప్రాంతంలో పనులు నిలిచిపోయాయి. గత 14 నెలలుగా విమర్శలు చేయడమే తప్ప ప్రభుత్వం చేసిందేమిలేదు. కొద్దిపాటి నిధులు ఖర్చుచేస్తే నిర్మాణాలు పూర్తిచేయవచ్చు. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించింది. ఆర్టికల్ 13ను నిర్లక్ష్యం చేస్తున్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. రాజధాని బిల్లులు గవర్నర్ దగ్గరికి పంపించడం మూర్ఖత్వం. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్ పక్కనపెట్టాలి. గవర్నర్ వాస్తవాలను గుర్తించాలి” అని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed