- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాంతిపురం ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి..
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ :
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో విద్యుత్ షాక్‌కు గురై హీరో పవన్ కళ్యాణ్ అభిమానులు ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం స్పందించారు. జనసైనికుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలను, బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
ఇదిలాఉండగా, పవన్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం సాయంకాలం బ్యానర్ కడుతూ విద్యుద్ఘాతానికి గురైన ఘటనలో సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు హరికృష్ణ, పవన్, సుబ్రహ్మణ్యం తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Advertisement
Next Story