రాజధానిపై అసత్య ప్రచారం : చంద్రబాబు

by srinivas |
రాజధానిపై అసత్య ప్రచారం : చంద్రబాబు
X

మరావతి నిర్మాణానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం అబద్ధం అని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాజధానికి వరదలు వస్తాయని వైసీపీ అసత్య ప్రచారం చేస్తున్నదని.. జగన్ ప్రభుత్వం వచ్చాకే అమరావతికి ముంపు వచ్చిందని విమర్శించారు. అమరావతి ఉద్యమం ప్రారంభమై నేటికి 50రోజులు పూర్తి కావొస్తోందని, అయినా రైతుల గోడు వినిపించుకునే నాథుడే లేడని సీపీఐ ఏపీ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ధర్నా నేటితో 50రోజులకు చేరుకుంది. దీంతో ఇవాళ రైతులకు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, సీపీఐ నేత రామకృష్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ… జగన్ సర్కారు తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో సంతోషంగా భూములు అప్పగించిన రైతులు… నేడు దీన స్థితిలో 50 రోజులుగా ఆందోళన చేయాల్సిన పరిస్థతి దాపురించిందని విమర్శించారు. రాజధాని కోసం ఇప్పటివరకు 39మంది రైతులు మరణించినా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పట్ల పోలీసుల ప్రవర్తన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతి నిర్మాణం సాధ్యం కాదని చెప్పడం అన్యాయమని, రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవని చెప్పడం అబద్ధం అన్నారు. రాజధానికి వరదలు వస్తాయని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే అమరావతికి ముంపు వచ్చిందని విమర్శించారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామనే వరకూ పోరాడుతామని హెచ్చరించారు. అమరావతిని శ్మశానం అన్నారు. శ్మశానంలో కూర్చొని పాలించాలా అని విమర్శించారని చంద్రాబాబు తెలిపారు. జగన్‌కు ఏసుప్రభువుపై నమ్మకం ఉంటే ఇక్కడే రాజధానికి కొనసాగిస్తానని చెప్పాలన్నారు. చట్టాలను విమర్శించేది అసలు ప్రభుత్వమే కాదని వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్ర్తాలు సందించారు.

Advertisement

Next Story

Most Viewed