- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ అనిత, వైఎస్సార్సీపీ రోజా… మాటల యుద్ధం
నగరి నియోజకవర్గంలోని సుందరయ్య నగర్‌లో రోజాకు పూల స్వాగతంపై టీడీపీ నేత అనిత, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రోజా పర్యటనను ఎత్తి చూపుతూ అనిత, ప్రపంచం అంతా సోషల్ డిస్టెన్సింగ్ అని మొత్తుకుంటున్న కీలక సమయంలో తుగ్లక్ సైన్యం మాత్రం అదేమీ పట్టించుకోవడం లేదని అన్నారు.
రోజాపై పూలు చల్లుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, ‘మనం రాజరికంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే సందేహం గత పది నెలలుగా నన్ను తొలుస్తుంది. కానీ మనం రాజరికంలో ఉన్నామని ఖచ్చితమైన కన్ఫర్మేషన్‌ను రోజా రెడ్డి ఇచ్చారు’ అని పేర్కొంటూ, ‘కరోనా విజృంభిస్తున్న వేళ పక్కపక్కనే నిలబడి బంతిపూలు చల్లటం ఏంటి రోజా రెడ్డి గారూ..? బంతిపూలు చల్లితే కరోనా చచ్చిపోతుందా?’ అని ప్రశ్నించారు.
బ్లీచింగ్ ఫౌడర్, పారాసిటమాల్ తర్వాత మీ కౌరవ సైన్యం(వైసీపీ నేతలు) కనిపెట్టిన కొత్త మందు బంతిపూలా? రోజా గారూ అని అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లాక్‌డౌన్ సమయంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో ట్రాక్టర్ ర్యాలీ చేసి మరీ సీఎం జగన్ భార్య భారతి రెడ్డి భజన చేశారని, దీంతో అక్కడ 11 మందికి కరోనా వ్యాపించిందని, దానికి బాధ్యులెవరు? అని ఆమె ప్రశ్నించారు.
దీనిపై రోజా ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా ఉంది కదా అని పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. తన నియోజకవర్గంలోని సుందరయ్య నగర్ లో కరెంట్, నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని… గత ప్రభుత్వం వీరి కోసం ఏమీ చేయలేదని… తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. ఆ సంతోషంతోనే ప్రజలు తనను ఆహ్వానించారని… అయితే వారు పూలు చల్లుతారని తాను ఊహించలేదని అన్నారు. వారు ప్రేమతో చేస్తున్న పనికి ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నానని చెప్పారు.
విపక్ష నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. తనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడబోనని చెప్పారు. సోషల్ మీడియా ఉంది కదా అని పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తానని ఆమె మరోసారి హెచ్చరించారు. కాగా, గతంలో అసెంబ్లీ సాక్షిగా వీరి మధ్య రేగిన మాటల యుద్ధం రోజా ఏడాది సస్పెన్షన్‌కు దారి తీసిన సంగతి తెలిసిందే.
Tags: ysrcp, tdp, roja, anita, chittoor nagari, welcome with flowers, social media