- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ ఏడాది 40 వేలకు పైగా ఫ్రెషర్లను నియమించుకోనున్న టీసీఎస్
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాదిలోను కరోనా సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీగా కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో సుమారు 40 వేలకు పైగా ఫ్రెషర్లను తీసుకుంటామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ రంగంలో దాదాపు 5 లక్షల వరకు ఉద్యోగులతో అతిపెద్ద కంపెనీగా ఉన్న టీసీఎస్ గతేడాది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 40 వేల వరకు కొత్తవాళ్లను నియమించుకుంది.
ఈ ఏదాది కూడా అదే స్థాయిలో లేదంటే ఇంకా ఎక్కువమందిని తీసుకోవాలని భావిస్తున్నట్టు హెచ్ఆర్ విభాగం హెడ్ మిలింద్ లక్కడ్ చెప్పారు. ఈ ఫ్రెషర్ల నియామకాలపై కరోనా సంబంధిత అంతరాయాల ప్రభావం ఉండని, గతేడాది జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలకు ఏకంగా 3.60 లక్షల మంది కొత్తవాళ్లు వర్చువల్ విధానంలో హాజరైనట్టు మిలింద్ తెలిపారు. ‘గత సంవత్సరం కరోనా పరిస్థితులను అధిగమించి 40 వేల మందిని తీసుకున్నాం. ఈ ఏడాది అంతకంటే ఎక్కువమందిని నియమించుకుంటామనే విశ్వాసం ఉందని’ మిలింద్ వెల్లడించారు. భారత్‌లో ప్రతిభ కలిగిన ఉద్యోగులకు కొరత లేదని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణ్యం చెప్పారు.