- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీసీఎస్‌లో 40,000 కొత్త నియామకాలు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) పెద్ద ఎత్తున కొత్త నియామకాలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఏకంగా 40,000 మందిని రిక్రూట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా కంపెనీ ఆదాయం క్షీణించినప్పటికీ నియమకాలను చేపట్టనుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో టీసీఎస్ గ్లోబల్ హెచ్ఆర్‌డీ హెడ్ మిలింద్ లకాడ్ మాట్లాడుతూ.. ఇండియాలో 35 నుంచి 45 వేల మందిని ఎంపిక చేస్తామని, వీరిలో 87శాతం తమ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లలో క్రియాశీలకంగా ఉన్నారని తెలిపారు. ప్రతి వారం 8 నుంచి 11 వేల మందిని ఆన్‌లైన్ ద్వారా ఎంపిక చెయనున్నామని, ఫ్రెషర్‌లతో పాటు అనుభవం, నైపుణ్యం ఉన్న వారిని కూడా కీలక పదవులకు ఎంపిక చేయనున్నట్టు మిలింగ్ లకాడ్ వివరించారు. కాగా, దేశీయంగా ఏడాది క్రితం కూడా 40,000 నియామకాలే చేసిన టీసీఎస్ కంపెనీ, ఈ ఏడాది అమెరికాలో మాత్రం దాదాపుగా రెట్టింపు నియామకాలన్ను చేపట్టనుంది. హెచ్1బీ, ఎల్1 వర్క్ వీసాలపై ఆధారపడకుండా ఉండాలని కంపెనీ భావిస్తోంది. అందుకే అమెరికాలో ఎక్కువమందిని ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో కూడా 2000 మందిని నియమించుకోనున్నట్టు వెల్లడించింది. ఇంజనీర్‌లను మాత్రమే కాకుండా అమెరికాలో టాప్ 1 బిజినెస్స్ స్కూల్స్ నుంచి గ్రాడ్యుయేట్లను కూడా నియమించుకోనున్నట్టు టీసీఎస్ ప్రకటించింది. ఇక, 2014 నుంచి టీసీఎస్ 20 వేల మందికి పైగా అమెరికన్‌లను నియమించుకున్న విషయం తెలిసిందే.