డిజిటల్ వ్యాపారాల కోసం నిధులు సేకరించే పనిలో టాటా సన్స్!

by Harish |
డిజిటల్ వ్యాపారాల కోసం నిధులు సేకరించే పనిలో టాటా సన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ టాటా సన్స్ తన డిజిటల్ వ్యాపారాలను మరింత విస్తరించడం కోసం 2.5 బిలియన్ డాలర్లు(రూ. 18.5 వేల కోట్లు) నిధులను సమీకరించాలని భావిస్తోంది. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ తన ‘సూపర్ యాప్’ పైలట్ లాంచ్ కోసం కంపెనీ సిద్ధమవుతున్న తరుణంలో డిజిటల్ వ్యాపారాల కోసం అంతర్జాతీయ పెట్టుబడిదారులను సంప్రదించినట్టు తెలుస్తోంది.

మేలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అమెరికా పర్యటనలో చాలామంది పెట్టుబడిదారులను కలుసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైవేట్ ఈక్విటీ, వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వాములను చేర్చుకోవడం ద్వారా నిధులు సమీకరిస్తామని ఆయన తెలిపారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలతో ఢీకొనేందుకు టాటా సన్స్ భారీ ప్రయత్నాలు చేస్తోంది. టాటా సంస్థ తన ‘సూపర్ యాప్’ కోసం ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలను సొంతం చేసుకుంది. రెండు వారాల క్రితం ప్రముఖ హెల్త్‌కేర్ స్టార్టప్ కంపెనీ క్యూర్‌ఫిట్‌ను రూ. 500 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. అంతేకాకుండా క్యూర్‌ఫిట్ కంపెనీ వ్యవస్థాపకుడిని టాటా డిజిటల్ విభాగానికి అధ్యక్షుడిగా కూడా నియమించిన సంగతి తెలిసిందే. ఈయనతో పాటు టాటా డిజిటల్ కంపెనీ బోర్డులో బిగ్‌బాస్కెట్ వ్యవస్థాపకుడు హరి మీనన్ కూడా చేరారు.

Advertisement

Next Story

Most Viewed