ఒకే రోజు 21 కొత్త కమర్షియల్ వాహనాలు విడుదల చేసిన టాటా మోటార్స్!

by Harish |
ఒకే రోజు 21 కొత్త కమర్షియల్ వాహనాలు విడుదల చేసిన టాటా మోటార్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో ఒకే రోజు 21 కొత్త కమర్షియల్ వాహనాలను విడుదల చేసింది. ట్రక్కులు, బస్సులతో సహా కార్గో, ప్రజా రవాణా విభాగాల్లో అవసరాలను తీర్చేందుకు ఈ వాహనాలను తీసుకొచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. సీఎన్‌జీ వేరియంట్లలో మిడ్-సైజ్, భారీ కమర్షియల్ విభాగాల్లో ఏడు వాహనాలను, తేలికపాటి కమర్షియల్ విభాగంలో ఐదు వాహనాలను కంపెనీ ఆవిష్కరించింది. అంతేకాకుండా లైట్ కమర్షియల్ విభాగంలో నాలుగు కొత్త వాహనాలను తీసుకొచ్చామని కంపెనీ తెలిపింది. పెరుగుతున్న ఈ-కామర్స్ డెలివరీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్ ఇంజిన్‌తో ఏస్ వాహనం, కార్గోలో వింగర్ వాహనాన్ని కంపెనీ విడుదల చేసింది.

అలాగే పట్టణ పరిధిలో రవాణా అవసరాల కోసం బస్సులతో సహా ఐదు ప్యాసింజర్ కమర్షియల్ వాహనాలను తీసుకొచ్చింది. భారత ఆర్థికవ్యవస్థను మరింత శక్తివంతం చేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వినియోగదారులు, ఈ-కామర్స్ రంగం కోసం నిరంతరం రవాణా అవసరాలను తీర్చే వాహనాలను అందించాలని భావించాం. ప్రస్తుతం మార్కెట్లు తాము కమర్షియల్ వాహనాల విభాగంలో మెరుగ్గా కొనసాగుతున్నాం. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త వాహనాలను తీసుకొచ్చామని’ టాటా మోటర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ అన్నారు.

Advertisement

Next Story