వాటా విక్రయానికి సిద్ధంగా ఉన్న టాటా మోటార్స్

by Shyam |
వాటా విక్రయానికి సిద్ధంగా ఉన్న టాటా మోటార్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాటా (TATA )మోటార్స్ త్వరలో రుణ రహిత సంస్థంగా మారే ప్రణాళికలను ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత తాజాగా టాటా టెక్నాలజీస్, టాటా హిటాచి కన్‌స్ట్రక్షన్‌లలో వాటా అమ్మకాల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమైంది. జులై 31నాటికి టాటా మోటార్స్ రుణాలు రూ. 68 వేల కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ తన సాఫ్ట్‌వేర్ విభాగం టాటా టెక్నాలజీస్, హిటాచీ జాయింట్ వెంచర్‌ యూనిట్లలో ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు వాటాదారులతో చర్చలను ప్రారంభించినట్టు సమాచారం.

నాన్-కోర్ ఆస్తుల నుంచి నిధులను సమీకరించడమే ముఖ్య ఉద్దేశ్యమని, ముందుగా ఈ రెండు సంస్థలతో ప్రారంభించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్ ( TATA moters) తమ మొత్తం రుణాలను మూడేళ్లలో సున్నా స్థాయికి తగ్గించడం. 2021-22 నుంచి నగదు ప్రవాహాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఉన్నట్టు కంపెనీ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఇటీవల కంపెనీ వార్షిక సమావేశంలో చెప్పారు.

అయితే, ఇటీవల సంస్థ వరుసగా నాలుగు సంవత్సరాలు డివిడెండ్ చెల్లించకపోవడం సహా ఇతర కారణాలతో వాటాదారులను నుంచి అభ్యంతరాలను ఎదుర్కొంటోంది. టాటా మోటార్స్ 75వ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)లో వాటాదారులను ఉద్దేశించి చంద్రశేఖరన్ మాట్లాడుతూ..ప్రస్తుతం టాటా గ్రూప్ నికర రుణం మార్చి 31 నాటికి రూ. 48 వేల కోట్లు. గణనీయంగా రుణాలను తగ్గిస్తాం. రానున్న మూడేళ్లలో సున్నాకు దగ్గరగా రుణ స్థాయిని తగ్గించాలనే లక్ష్యంతో ఉన్నామని’ చెప్పారు.

Advertisement

Next Story