టాటా కార్లపై భారీ ఆఫర్లు

by Harish |
టాటా కార్లపై భారీ ఆఫర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్న ఆటోమొబైల్ కంపెనీలు పండుగ సీజన్ కోసం భారీగానే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు కోలుకోవడం, పండుగ సీజన్ రావడంతో విక్రయాలు పెరుగుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీలు డిస్కౌంట్లను, ఆఫర్లను ఇస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ అన్ని రకాల వాహనాలపై భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది.

ఇవి అత్యధికంగా రూ. 80 వేల వరకు ఉన్నాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్లు సెప్టెంబర్ చివరి వరకు అందుబాటులో ఉంటాయని, టాటా టియాగో, హారియర్, నెక్సాన్ మోడళ్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. టాటా హారియర్‌పై అత్యధికంగా రూ. 80 వరకు తగ్గింపును కంపెనీ ఇచ్చింది. రూ. 25 వేల డిస్కౌంట్, రూ. 15 వేల అదనపు కార్పొరేట్ ఆఫర్, రూ. 40 వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కంపెనీ అందిస్తోంది.

అలాగే, టాటా టియాగో మోడళ్లపై రూ. 32 వేల వరకు తగ్గింపును కంపెనీ అందిస్తోంది. కన్జ్యూమర్ స్కీమ్ ద్వారా రూ. 15 వేలు, రూ. 7 వేల కార్పోరేట్ తగ్గింపు, రూ. 10 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇక, టాటా నెక్సాన్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడళ్లపై రూ. 15 వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కంపెనీ ఇస్తోంది. అయితే, ఇది డీజిల్ వేరియంట్‌లో మాత్రమే అని, ఈ వేరియంట్‌ను ఎంపిక చేసుకునే వారికి రూ. 10 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed