రక్తదాన శిబిరం ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Shyam |

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నారాయణ‌గూడ‌ సెంట్రల్ బ్లడ్ బ్యాంకులో టీజీవో, టీఎన్జీవో సంఘాల ఆధ్వర్యంలో తలసేమియా రోగుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సోమవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవిప్రసాద్, TNGO అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, TGO ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి రవీందర్ కుమార్ గౌడ్, కార్యదర్శి సహదేవ్, వెంకటయ్య, రవీందర్ రావు, అరుణ్ కుమార్, సబిత, కృష్ణ యాదవ్, గoడూరి వెంకట్ పాల్గొన్నారు. తలసేమియా వ్యాధి రోగుల కోసం ఉద్యోగులు రక్తదానం చేయటాన్ని మంత్రి అభినందించారు.

Tags: Narayanaguda, Central Blood Bank, TGO, TNGo, Thalassemia, BloodDonation Camp,

Next Story

Most Viewed