పాయల్‌కి బీటౌన్ బ్యూటీ క్షమాపణ.. కారణం అదే..

by Shyam |   ( Updated:2021-12-03 23:04:17.0  )
Tadap
X

దిశ, వెబ్‌డెస్క్: పాయల్ రాజ్‌పుత్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ. తన తొలి సినిమాతోనే ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకుంది. ఆ సినిమాలో తన అందాలతో కుర్రకారుని కట్టిపడేసింది. అంతేకాకుండా తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ సినిమా 2018లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అయితే హిందీలో ఈ సినిమాకు ‘తడప్’ అని నామకరణం చేశారు. ఇందులో సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్ నిమగ్నమయ్యారు.

అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాయల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘తడప్ సినిమాలో భాగం కావాలని నేను తప్పకుండా కోరుకుంటాను. అయినా ఎవరిని తీసుకోవాలి అన్నది మేకర్స్ నిర్ణయం. నా స్థానంలో తారా సుతారియాను తీసుకున్నారు. ఈ సినిమా క్యాస్ట్(తారాగణం) చాలా బాగుంది. సినిమా అంతకుమించి అనేలా ఉంటుందని భావిస్తున్నాను. సినిమా తప్పకుండా భారీ హిట్ కావాలని కోరుకుంటున్నాను.‘తడప్’లో నేనూ ఓ భాగంగా కావాలని కోరుకున్నాను. ఇలాంటి అవకాశం వస్తే ఎవరు ఒద్దంటారు’ అని పాయల్ చెప్పుకొచ్చింది.

దీనిపై తారా సుతారియా ఇటీవల జరిగిన ప్రమోషన్స్‌లో స్పందించింది. ‘ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ అద్భుతంగా నటించింది. నేను ఆ పాత్ర వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. పాయల్, కార్తికేయ చేసిన విధంగానే మేమూ చాలా సన్నివేశాలు చేశాము. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. నన్ను సెలక్ట్ చేసినందుకు మేకర్స్‌కి ధన్యవాదాలు. అంతేకాకుండా పాయల్.. సో సారి’ అని పాయల్‌కు క్షమాపణ చెప్పింది.

ఇదిలా ఉంటే 2018లో ఆర్ఎక్స్ 100 భారీ విజయం అందుకుంది. దీంతో పాయల్, కార్తికేయకు భారీ ఫాలోయింగ్ వచ్చింది. అందుకే ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయాలని నిర్మాత సాజిద్ ఖాన్ నిర్ణయించుకున్నారు. హిందీలో రీమేక్ చేసిన ‘తడప్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed