- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్ డెస్క్ : క్షుద్రపూజల పేరుతో బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు ఓ కిరాతకత తాంత్రికుడు. బాలిక అనారోగ్యంతో మాంత్రికుడి దగ్గరకు వెళ్లగా.. మత్తుమందు ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన యూపీలోని బస్తీ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు తహ్రీర్పై అత్యాచార, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం.. ఈ నెల 22వ తేదీన రాత్రి బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో బాధితురాలి తల్లి తాంత్రికుడి దగ్గరకు తీసుకువెళ్లింది. ఇదే అదునుగా భావించిన కామాంధుడు.. చికిత్స పేరిట బాలికకు మత్తు మందు ఇచ్చి.. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ఆమెపై అత్యాచారం చేశాడు.
ఈ క్రమంలో బాలికకు తీవ్ర రక్తస్రావం అయినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. రక్తస్రావం చూసిన బాధితురాలి తల్లి ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లింది. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.