ఆ వయసొచ్చాకే.. దాచుకున్నా : బాలీవుడ్ నటి

by Shyam |   ( Updated:2021-07-06 01:53:49.0  )
ఆ వయసొచ్చాకే.. దాచుకున్నా : బాలీవుడ్ నటి
X

దిశ, సినిమా : బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో కనిపించిన నటి తనీషా ముఖర్జీ.. తన పర్సనల్ లైఫ్‌ ప్లాన్స్ రివీల్ చేసింది. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా పిల్లల్ని కనేందుకు వీలుగా 39 ఏళ్లకే తన అండాలను ఫ్రీజ్ చేసుకున్నట్టు వెల్లడించింది. నిజానికి 33 సంవత్సరాల వయసులోనే ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యేందుకు ట్రై చేసినా.. తను గర్భం దాల్చడం వీలుకాదని కన్‌ఫర్మ్ అయినపుడే అలా చేయాలని డాక్టర్ సూచించడంతో ఆగిపోయానని చెప్పింది. ఇది తన పర్సనల్ చాయిస్ అని చెప్పిన తనీషా.. పిల్లలు లేక బాధపడుతున్న మహిళలకు వారికిదే సరైన మార్గమని తెలిపింది. ఇప్పటికీ పెళ్లి చేసుకోని ఈ నటి.. ‘ఒక దశలో పిల్లలు లేరనే ఆలోచనలు చుట్టుముట్టడంతో.. పలువురి సలహాతో ఫైనల్‌గా 39 సంవత్సరాల వయసులో అండాలను ఫ్రీజ్ చేసుకున్నా. ఈ ప్రొసీజర్‌లో భాగంగా డాక్టర్లు.. బాడీలోకి అధిక మొత్తంలో ప్రొజెస్టరాన్ను పంపిస్తారు. దీని వల్ల బరువు పెరగరు కానీ శరీరం ఉబ్బిపోయి మెరుపుదనం వస్తుంది. ఇక నా అండాలను ఫ్రీజింగ్ మెథడ్ ద్వారా దాచుకోవడం పట్ల హ్యాపీగా ఉన్నా’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed