- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
'సోనూసూద్ చాలా కమర్షియల్.. ఛారిటీ కోసం రమ్మన్నా డబ్బులు అడిగాడు'
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కష్టకాలంలో సాయం అన్న ప్రతి ఒక్కరికి తనవంతు సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు నటుడు సోనూసూద్. ఆక్సిజన్ లేక ఇబ్బందిపడుతున్నవారి కోసం ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేసి కరోనా కష్టకాలంలో ఆసరాగా నిలుస్తూ అందరి ప్రసంశలను అందుకుంటున్నాడు. అయితే ఇప్పుడున్నట్లు సోను ఒకప్పుడు ఉండేవాడు కాదట.. ఒకానొక సమయంలో చాలా కమర్షియల్ గా సోనూసూద్ ప్రవర్తించాడని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
“సోనూసూద్ ఇప్పుడు నాకు దేవుడితో సమానం.. ఆయన చేస్తున్న పనులు ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. ఎంతోమంది అభాగ్యులను అక్కున చేర్చుకొని ఆయన చేస్తున్న సేవ గురించి మాట్లాడే అర్హత కూడా మనకు లేదు” అని చెప్పుకొచ్చారు. అయితే ఈ సేవా గుణం సోను లో ఒకప్పుడు లేదని, గతంలో తానూ ఓ ఛారిటీ ట్రస్ట్ కోసం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం కోసం ఆయనను పిలవగా.. ఆయన దానికి డబ్బులు అడిగారని తెలిపారు. అప్పట్లో సోనుసూద్ ని చూసి ఈ మనిషి ఇంత కమర్షియల్ ఏంటీ అని అనుకున్నాని అన్నారు. కానీ ఇప్పుడు తన ఆస్తులను సైతం అమ్మి ప్రజలకు సేవ చేస్తున్న అతనిని చూస్తే దేవుడు గుర్తొస్తున్నాడని అన్నారు.