బీజేవైఎం ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిగా తమ్మల ఉదయ్

by Aamani |
BJYM
X

దిశ, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడిగా నేరడిగొండ మండలం వాంకిడి గ్రామానికి చెందిన తమ్మల ఉదయ్ ఎన్నికైనట్లు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సాబ్లే సంతోష్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా సాబ్లే సంతోష్ సింగ్ మాట్లాడుతూ… తమ్మల ఉదయ్ పాఠశాల దశలో ఏబీవీపీ కార్యకర్తగా, 2014 నుండి బీజేపీ కార్యకర్తగా పనిచేశారన్నారు. పదవి లేకున్నా పార్టీ కార్యక్రమాలకు ముందుండే వాడని, నిరుత్సాహ పడకుండా పార్టీ ఎదుగుదలకు తోడ్పాటును అందించాడని అన్నారు. ఇన్ని రోజులకు తనకు తగిన గుర్తింపు దక్కడం సంతోషకరమని, నేరడిగొండ మండలంపై పార్టీకి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత ఉత్సాహంతో కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానందం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, నేరడిగొండ మండల అధ్యక్షుడు సోసయ్య హీరాసింగ్‌లకు ఉదయ్ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed