తమిళనటుడు విజయ్‌కాంత్ కు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

by Shyam |   ( Updated:2021-05-18 23:24:27.0  )
తమిళనటుడు విజయ్‌కాంత్ కు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయ్‌కాంత్ అస్వస్థతకు గురయ్యారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌ మధ్యలో ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతుండడంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం విజయ్‌కాంత్ కు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి వర్గాల నుంచి వెలువడుతున్న సమాచారం. ఇక గతేడాది విజయ్‌కాంత్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటూ చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఇక విజయకాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed