‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ బ్యాన్‌పై కేంద్రానికి తమిళనాడు లేఖ

by Shyam |
The family man 2 poster
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, సమంత అక్కినేని లీడ్ రోల్స్ ప్లే చేసిన హిందీ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ చిక్కుల్లో పడింది. రాజ్ అండ్ డీకే నిర్మించిన సిరీస్ జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. ఇండియాలో సిరీస్‌ను బ్యాన్ చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లెటర్ రాయడం చర్చనీయాంశమైంది. ఇటీవలే రిలీజైన ట్రైలర్‌లో ఈలం తమిళులను అత్యంత అభ్యంతరకర రీతిలో చూపించారని, శ్రీలంకలో వారి చారిత్రక పోరాటాన్ని కించపరచడం, వక్రీకరించడమే లక్ష్యంగా తెరకెక్కినట్లుగా ఉందని లేఖలో పేర్కొన్నారు. కాగా ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతుండగా.. ఇందులో తమిళ మూలాలున్న సమంత నటించడం పట్ల నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘#FamilyMan2_against_Tamils’ హ్యాష్ ట్యాగ్‌ను నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story