'మాస్టర్' దర్శకుడికి కరోనా.. టెన్షన్ లో కమల్ ఫాన్స్

by Anukaran |   ( Updated:2021-03-30 00:15:41.0  )
మాస్టర్ దర్శకుడికి కరోనా.. టెన్షన్ లో కమల్ ఫాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ‘మాస్టర్’ సినిమాతో అటు తమిళ్, ఇటు తెలుగు ఇండస్ట్రీలో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందని లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం తాను హాస్పిటల్ చికిత్స పొందుతున్నానని, వైద్యులు తనను జాగ్రత్తగా చూసుకొంటున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు లోకేష్ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరుకొంటున్నారు.

ఇకపోతే ప్రస్తుతం లోకేష్ ‘మాస్టర్’ సినిమా తర్వాత కమల్ హాసన్ తో ‘విక్రమ్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఒక పక్క కమల్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. మరోపక్క లోకేష్ కరోనా బారిన పడడంతో అభిమానులు భయాందోళనలకు గురవుతున్నారు. కమల్ ఎన్నికలు పూర్తీ చేసుకొని ఈ షూటింగ్ లో పాల్గొననున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తీ చేసుకొని, ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.

Advertisement

Next Story