వధూవరులకు పెట్రోల్‌ను కానుకగా ఇచ్చిన టాప్ కమెడియన్

by Shyam |
newly-married couple
X

దిశ, సినిమా: కోలీవుడ్ కమెడియన్ మయిల్‌సామీ హెడ్ లైన్స్‌లో నిలిచాడు. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలను వ్యతిరేకిస్తూ నూతన వధూవరులకు ఐదు లీటర్ల పెట్రోల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి నిరసన తెలపడంతో.. ఈ యూనిక్ ఇన్సిడెంట్‌ను లోకల్ మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా ప్రచారం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తమిళనాడు ప్రభుత్వం పెట్రో ధరలపై మూడు రూపాయలు తగ్గించి, రాష్ట్ర సర్కార్ భరిస్తుందని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. కాగా జయలలిత, ఎంజీఆర్ అనుచరుడైన మయిల్‌సామీ గతంలో విరుగమ్ బక్కమ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

Advertisement

Next Story