తమన్నా, కాజల్ డిజిటల్ ఎంట్రీ..

by Anukaran |   ( Updated:2020-10-23 08:00:55.0  )
తమన్నా, కాజల్ డిజిటల్ ఎంట్రీ..
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో వధువుగా మారబోతున్న బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేసిన వెబ్ సిరీస్ గురించి ఇన్ స్టాగ్రామ్ వేదికగా వివరాలు తెలిపింది. లైవ్ టెలికాస్ట్ పేరుతో వస్తున్న సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుండగా.. వైభవ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న కాజల్ ఘోస్ట్‌గా ఫస్ట్‌లుక్‌తో అదరగొట్టేసింది. ఇంతకు ముందు ఎన్నడూ చేయని పాత్రలో కాజల్ కనిపిస్తుండగా..ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. డిఫరెంట్ అవతార్‌లో చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నామని చెబుతున్నారు.

https://www.instagram.com/p/CGrve9lHc3A/?igshid=5g4lwpkf5g8p

మరో వైపు తమన్నా కూడా తన డిజిటల్ ఎంట్రీ ఖరారు చేసింది. నవంబర్ స్టోరీస్ పేరుతో వస్తున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌తో వచ్చేస్తోంది. ఇంద్ర సుబ్రమణ్యన్ దర్శకత్వంలో వస్తున్న సిరీస్ ట్రైలర్ ఆకట్టుకోగా హాట్‌స్టార్ స్పెషల్స్‌లో అలరించనుంది. మొత్తానికి ఇద్దరు స్టార్ హీరోయిన్లు తమన్నా, కాజల్ డిజిటల్ సిరీస్‌లతో కోలీవుడ్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారు.

https://www.instagram.com/tv/CGrta16BIGz/?igshid=kglqfndc9ug9

Advertisement

Next Story