- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమన్నా స్వయంవరంలో ప్రభాస్ ఉండాలంతే!
దిశ, వెబ్‌డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 15 ఏళ్లు పూర్తయ్యాయి. గ్లామరస్ క్వీన్‌గా మెప్పించిన తమన్నా యాక్టింగ్‌లోనూ అదరగొట్టింది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే తమన్నా పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలియడంతో .. ఓ ఇంటర్వ్యూలో ఎలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా కావాలని ప్రశ్నించారు తమన్నాను. పెళ్లి కోసం స్వయంవరం ప్రకటిస్తే.. అందులో ఏ నటులు ఉండాలని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు వెంటనే ప్రభాస్, విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ పేర్లను చెప్పేసింది ముద్దుగుమ్మ. వీళ్లు ఖచ్చితంగా స్వయంవరానికి హాజరుకావాలని కోరుకుంది.
ఇక సినిమాల్లో కిస్ సీన్స్‌కు ఎప్పుడూ నో చెప్తూనే ఉంటుంది తమన్నా. ముందు ఆ ఒప్పందానికి ఓకే చేస్తేనే సైన్ చేస్తుంది తమ్ము బేబి. ఒకవేళ సినిమాలో తమన్నా కిస్ సీన్ ఉంటే … కెమెరాతో మ్యాజిక్‌లు చేయాల్సిందే. కానీ హృతిక్ రోషన్ విషయంలో మాత్రం అలాంటి రూల్స్ పెట్టనని చెప్తుంది. గ్రీకువీరుడు హృతిక్‌ను కిస్ చేసే ఛాన్స్ వస్తే వదులుకునే ప్రసక్తే లేదని చెప్తోంది.