అఫ్ఘాన్‌లో అరాచకం.. ఎగురుతున్న హెలికాప్టర్‌కు మృతదేహాన్ని వేలాడదీసి..

by vinod kumar |   ( Updated:2021-08-31 06:17:41.0  )
అఫ్ఘాన్‌లో అరాచకం.. ఎగురుతున్న హెలికాప్టర్‌కు మృతదేహాన్ని వేలాడదీసి..
X

దిశ వెబ్‌డెస్క్: తాలిబన్లు ఎంతటి ఆటవిక న్యాయం అమలు చేస్తారో మరోసారి ప్రత్యక్షంగా చూపెట్టారు. ఈ క్రూరత్వాన్ని తట్టుకోలేమనే భయపడి, వేలాది మంది దేశాన్ని విడిచి పెట్టడానికి ఉరుకులు పరుగులు పెట్టినట్లు ప్రపంచానికి అర్థమయింది. ఓ వ్యక్తిని చంపిన తాలిబన్లు, కాందహర్ నగరంపై అమెరికా వదిలి పెట్టిన బ్లాక్ హవాక్ హెలికాప్టర్‌లో ఊరేగించారు. శరీరం తాడుకు కట్టి గాల్లో ఎగురుతున్న హెలికాప్టర్ వీడియోను స్థానిక జర్నలిస్టులు తమ ఫోన్లలో బంధించి వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే హెలికాప్టర్ చాలా ఎత్తులో ఉండటంతో వ్యక్తి చనిపోయాడా ? లేదా అనే విషయంలో స్పష్టత లేకున్నా, తాలిబన్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అది మృతదేహమే అని తెలుస్తుందని కొంతమంది జర్నలిస్టులు తెలిపారు. అయితే ఏ విషయంలో చంపారు.. ఎందుకు చంపారు.. చనిపోయిన వ్యక్తి ఎవరనే వంటివి ఇంకా బయటకు రాలేదు. కాగా, నిన్న రాత్రి అమెరికా తన ఇరవై సంవత్సరాల యుద్ధాన్ని ముగించి కాబూల్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అర్థరాత్రి ప్రాంతంలో తన చిట్ట చివరి సైనికుడు విమానం ఎక్కుతున్న వీడియోను విడుదల చేసింది. వెళ్లే ముందు అప్ఘాన్‌లో ఉన్న విలువైన ఆయుధ సామాగ్రిని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. తరువాత కొద్దిసేపటికే తాలిబన్లు మొత్తం విమానాశ్రయాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ విమానాశ్రయాన్ని తిరిగి నడపడానికి ఖతార్ ఆసక్తి కనబరుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed