అనురాగ్‌కు తాప్సీ సపోర్ట్..

by  |
అనురాగ్‌కు తాప్సీ సపోర్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను.. దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. తనను అనురాగ్ లైంగికంగా వేధించాడని ‘ప్రయాణం’ మూవీ ఫేమ్ పాయల్ ఘోష్ తాజాగా ఆరోపణలు చేయడంతో తాప్సీ తన ఫ్రెండ్‌కు మద్దతునిచ్చింది. తనతో ఫ్రెండ్లీగా ఉన్న ఫొటోను షేర్ చేసిన తాప్సీ.. ‘మై ఫ్రెండ్ నాకు తెలిసిన అతిగొప్ప స్త్రీవాది నువ్వు. మీ సినిమాల్లో.. మీరు సృష్టించిన ప్రపంచంలో మహిళలు ఎంత గొప్ప శక్తివంతమైనవారో.. ఎంత ముఖ్యమైన వారో అందరికీ తెలుసు. అలాంటి మరో సినిమా సెట్స్‌లో మళ్లీ కలుద్దాం’ అని తెలిపింది తాప్సీ.

https://www.instagram.com/p/CFWLKlFpP5C/?igshid=1kxcctlbnmzd1

కాగా, పాయల్ ఘోష్.. అనురాగ్ కశ్యప్ తన ముందు నగ్నంగా నిలబడి తనను బలవంతం చేశాడని ఆరోపించింది. తాను భయపడుతుండటం చూసి.. నేను ఒక్క కాల్ చేస్తే చాలా మంది హీరోయిన్లు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ‘బాంబే వెల్వెట్’ సినిమాలో ఆఫర్ కోసం చాలా మంది ట్రై చేస్తున్నారని.. అడిగితే వచ్చేస్తారని చెప్పాడంది పాయల్. ఈ ఘటన 2014లో జరిగిందన్న పాయల్.. ‘మీ టూ’ ఉద్యమం సమయంలో దీని గురించి మాట్లాడాలని అనుకున్నా.. భవిష్యత్ పాడవుతుందని, సినిమా చాన్స్‌లు రావని కుటుంబ సభ్యులు ఆపారని తెలిపింది. కాగా పాయల్ ఆరోపణలపై బాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగుతోంది.


Next Story

Most Viewed