యాక్టర్స్‌కి హీరోయిన్ తాప్సీ సలహాలు

by Shyam |
యాక్టర్స్‌కి హీరోయిన్ తాప్సీ సలహాలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలెంటెడ్ హీరోయిన్ తాప్సీ పన్ను యాక్టర్స్‌కు సూచనలు ఇచ్చింది. తను నటించిన ‘బేబీ’ మూవీ రిలీజ్ అయి ఆరేళ్లు అయిన సందర్భంగా.. ట్విట్టర్‌లో స్పెషల్ పోస్ట్ పెట్టింది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకులు. ఇందులో స్పెషల్ రోల్ ప్లే చేసింది తాప్సీ. ఏజెంట్ షబానా ఖాన్‌గా కనిపించి మెప్పించింది. కేవలం ఏడు నిమిషాల నిడివిగల పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న తాప్సీ..‘డియర్ యాక్టర్స్ మనం ఎంత సేపు నటించామనేది మ్యాటర్ కాదు..తెరపై కనిపించిన ఆ కాసేపట్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశామనేదే మ్యాటర్’ అని పోస్ట్ పెట్టింది.

బేబీ సినిమాలో కనిపించిన ఏడు నిమిషాలు తన లైఫ్ ను టర్న్ చేశాయని చెప్పింది. బేబీ సిక్వెల్‌గా వచ్చిన ‘నామ్ షబానా’ 2017లో రిలీజ్ కాగా, బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ సక్సెస్ అయింది. ‘బేబీ’ సినిమా తాప్సీ బాలీవుడ్ కెరీర్‌పై సూపర్ ఇంపాక్ట్ చూపించింది. ఈ చిత్రం తర్వాత ‘పింక్’ ‘బద్లా’ ‘థప్పడ్’ లాంటి సినిమాల ద్వారా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ.. బీ టౌన్‌లో సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ‘మిథాలీ రాజ్ బయోపిక్’ ‘రష్మి రాకెట్’ లాంటి స్పోర్ట్స్ డ్రామా మూవీస్ చేస్తున్న తాప్సీ..‘లూప్ లపేట’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. మరో వైపు సౌత్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి‌తో కలిసి నటించిన సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.

Advertisement

Next Story