టీ20 వరల్డ్ కప్‌‌లో‌ న్యూ ఫార్మాట్‌.. మొత్తం 20 జట్లు..!

by Shyam |
టీ20 వరల్డ్ కప్‌‌లో‌ న్యూ ఫార్మాట్‌.. మొత్తం 20 జట్లు..!
X

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్ మార్చడానికి ఐసీసీ నిర్ణయించింది. 2024లో అమెరికా-వెస్టిండీస్ క్రికెట్ బోర్డులు ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 వరల్డ్ కప్ నుంచి ప్రస్తుతం ఉన్న ఫార్మాట్‌ను పూర్తిగా మార్చేయనున్నది. 2024 వరల్డ్ కప్‌లో తొలి సారిగా 20 జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు 16 జట్లు వరల్డ్ కప్ ఆడుతుండగా.. అదనంగా మరో 4 జట్లకు అవకాశం రానున్నది. 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించి మొత్తం 55 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 2024 జూన్‌లో 25 రోజుల పాటు ఈ మెగా ఈవెంట్ జరుగనున్నది. ఐసీసీ ర్యాంకింగ్స్, క్వాలిఫయర్స్ ఆధారంగా వరల్డ్ కప్‌లో పాల్గొనే 20 జట్లను నిర్ణయించనున్నారు. ఇక ఎన్నడూ లేని విధంగా 2024 వరల్డ్ కప్ 18 వేదికల్లో నిర్వహించనున్నారు. కరేబియన్ దీవుల్లోని 13 వేదికలకు తోడుగా అమెరికాలోని 5 వేదికల్లో పొట్టి ప్రపంచ కప్ జరుగుతుంది. త్వరలోనే ఐసీసీ టెక్నికల్ బృందం కరేబియన్ దీవులు, అమెరికాలో పర్యటించి వరల్డ్ కప్ వేదికలను నిర్ణయించనున్నది. ఇక మొత్తం 55 మ్యాచ్‌లలో 35 కరేబియన్ దీవుల్లో, 20 అమెరికాలో జరుగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed