T20 WorldCup: బోణీ కొట్టిన ఆస్ట్రేలియా

by Anukaran |   ( Updated:2021-10-23 08:20:53.0  )
Australia
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా బోణి కొట్టింది. తొలి మ్యాచ్‌లోనే ప్రత్యర్థి సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. యూఏఈలోని అబుదాబీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 118 పరుగులకే పరిమితమైంది. దీంతో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట తడబడ్డా ఎట్టకేలకు విజయం సాధించింది. చివరి వరకూ పోరాడి, 5 వికెట్లు కోల్పోయి 19.4 బంతుల్లో లక్ష్యాన్ని చేధించి టీ20 వరల్డ్‌ కప్‌లో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్సింగ్స్‌లో మార్కారమ్(40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

https://twitter.com/T20WorldCup/status/1451905231311106055?s=20

Advertisement

Next Story