ఫ్రీగా టీ20 లైవ్ మ్యాచ్‌లు

by Shyam |
ఫ్రీగా టీ20 లైవ్ మ్యాచ్‌లు
X

దిశ, స్పోర్ట్స్ :

క్రికెట్ అంటేనే ఆటను మించిపోయిన వ్యాపారం. ముఖ్యంగా టీ20ల రంగప్రవేశంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు టీ20లు నిర్వహిస్తున్నాయి. ఈ మ్యాచ్‌ల లైవ్ ప్రసార హక్కుల ద్వారానే వందల కోట్లు బోర్డుల ఖజానాను నింపుతున్నాయి. ఇంగ్లాండ్‌లో దేశవాళీ టీ20 అయిన టీ20 బ్లాస్ట్ లీగ్‌ను ఉచితంగా సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయాలని కౌంటీలు నిర్ణయించాయి. కరోనా వైరస్ కారణంగా గురువారం నుంచి ప్రారంభం కావల్సిన టీ20 బ్లాస్ట్ లీగ్ పోటీలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే ఈ సీజన్‌లో జరగాల్సిన ఈ కౌంటీ లీగ్ పోటీలను అక్టోబర్‌లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. టీ20 బ్లాస్ట్ మ్యాచ్‌లను స్కై స్పోర్ట్స్ ప్రసారం చేస్తుంటంది. అయితే 2020 నుంచి బ్రాడ్‌కాస్టర్లతో కుదిరిన ఒప్పందం మేరకు.. ఆయా కౌంటీల మ్యాచ్‌లను వారి సొంత సోషల్ మీడియా అకౌంట్లలో గానీ, యూట్యూబ్‌లో గానీ ప్రత్యక్ష ప్రసారం చేసుకునే వీలుంది. దీంతో ఈ ఏడాది ప్రతీ కౌంటీ తమ మ్యాచ్‌లను యూట్యూబ్‌లో ప్రసారం చేయాలని నిర్ణయించాయి. గత ఏడాది ప్రయోగాత్మకంగా సోమర్‌సెట్ జట్టు ససెక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను యూట్యూబ్‌లో ప్రసారం చేయగా 10 లక్షల మంది వీక్షించారు. ప్రస్తుతం కరోనా కారణంగా ప్రేక్షకులు స్టేడియంలకు తరలివచ్చే అవకాశం తక్కువగా ఉండటంతో.. యూట్యూబ్ ప్రసారాల్లో వీక్షించే వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Next Story