T-Hub, AIM : ఆ రంగంలో కొత్త పరిష్కారాల కోసమే

by Harish |   ( Updated:2021-07-14 05:44:59.0  )
business news
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రైన్యూర్ షిప్ కోసం స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించే టీ-హబ్ ప్రముఖ అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఏఐఎం)తో ఒప్పందం కుదుర్చుకుంది. హెల్త్‌కేర్ స్టార్టప్‌ల కోసం ఏఐఎంతో కలిసి ప్రత్యేక కార్యక్రమాన్ని టీ-హబ్ మొదలుపెట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా టెక్ సైన్స్, హెల్త్‌కేర్ రంగంలో కొత్త పరిష్కారాల కోసం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మూడు నెలల పాటు జరిగే ఈ కార్యక్రమంలో లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగంలోని ఉత్పత్తులు, పరిష్కారాలను అభివృద్ధి చేసేవారికి ఎంతో ఉపయోగపడుతుందని కార్యక్రమ నిర్వహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని, ఐటీ అండ్ ఇండస్ట్రీస్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయెష్ రంజర్, ఏఐఎం మిషన్ డైరెక్టర్ చింతన్ వైష్ణవ్, టీ-హబ్ సీఈఓ రవి నారాయణ్ ప్రారంభించారు.

“అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఏఐఎం)తో టీ-హబ్ భాగస్వామ్యం ద్వారా ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్స్ రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలం. స్టార్టప్ కంపెనీలకు ఉన్నతమైన వనరులను, నిపుణులను అందించడానికి ఈ కార్యక్రమం ద్వారా వీలవుతుందని” జయెష్ రంజన్ అన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో రోగ నిర్ధారణ, చికిత్స కోసం ఖచ్చితత్వాన్ని నిరూపించే సాంకేతిక ఆవిష్కరణల కోసమే ఈ కార్యక్రమం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హెల్త్‌టెక్ స్టార్టప్ కంపెనీలకు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని టీ-హబ్ సీఈఓ రవి నారాయణ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed